"పిరమిడ్" అన్నది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్నా " న్యూ ఏజ్ స్పిరిచ్యువల్ మూవమెంట్ " ను సూచిస్తుంది. " పిరమిడ్ " పైనున్న ఏకత్వాన్ని, క్రిందనున్న వైశాల్యాన్ని సూచిస్తుంది. " పిరమిడ్ " శాస్త్రీయ దృక్పధానికి ప్రతీక. కనుకనే ఈ సరికొత్త రాజకీయ పార్టికి " పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా " అని నామకరణం చేయడం జరిగింది.


ప్రస్తుతానికి ఇది " పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా " యొక్క అవతరణ. అయితే అనతికాలంలో "పిరమిడ్ పార్టీ" అన్ని ఇతర దెశలలోనూ ప్రారంభించబడుతుంది ! మన వర్తమాన జన్మకాలం లోనే "వసుధైక కుటుంబం" ను మనం కళ్లారా చుడబోతం!

ఈ వసుధ అంతా ఒకే ఒక కుటుంబం ! ప్రపంచ ప్రజలందరూ ఒకే తల్లి బిడ్డలు ! ఎవ్వరూ 'విదేశీయులు' కాదు ! అందరు కూడా స్వకుటుంబికులే ! సకల చరాచర సృష్టి అంతా ఒకే భగవత్ తత్వాన్ని పునికిపుచ్చుకున్నదే !