" పిరమిడ్ పార్టీ అవతరణ "

" పిరమిడ్ పార్టీ " ఆవిర్భావం... " పిరమిడ్ పార్టీ " ఎన్నికల సంఘంచే రిజిస్ట్రేషన్ .. పిరమిడ్ పార్టీ 1999, 2004 సార్వత్రిక ఎన్నికలలో రంగప్రవేశం ... ఇవన్ని జరిగిపోయిన చారిత్రాత్మిక సంఘటనలు ! " పిరమిడ్ పార్టీ " చరితలో ఈ సంఘటనలన్నీ సువర్ణాక్షరాలతో లిఖించదగినవి ! " పిరమిడ్ పార్టీ " ద్వారా ఇరవైయవ శతాబ్ది చివరలో ఆధ్యాత్మిక వాదుల, ఆత్మజ్ఞానుల "రాజకీయ అరంగ్రేటం" అన్నది యావత్ ప్రపంచం హర్చించదగ్గ అత్యద్భుత విషయం !

ఈ 2009 ఎన్నికల్లో ఆంధ్రరాష్ట్రంలో అన్ని శాసనసభ మరి లోక్ సభ నియోజికవర్గలకూ ఆధ్యాత్మిక మాస్టర్లను పార్టీ ప్రతినిధులుగా సంసిద్ధం చేస్తున్నాం ! సమయం చాలా తక్కువగా ఉంది ! తక్షణం కార్యాచరణకు పూనుకోవాలి !

" పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా " ఈ భూమండలంలో నవ్య జ్ఞాన యుగానికి నాంది పలుకుతోంది. అయితే, ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టింది ... ఇంటర్ గెలక్టిక్ ఫెడరేషన్ ... ... వాళ్లు ! ఇక్కడ, ఈ భూలోకంలో, భౌతిక దేహం తో ఉన్నా " పిరమిడ్ పార్టీ " సభ్యులు, కార్యకర్తలు కేవలం నిమిత్త మాత్రలు మాత్రమే !