1999 ఫిబ్రవరి 25!

" పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా " జన్మదినం !

పిరమిడ్ సొసైటీస్ మస్తేర్లకు, ఆత్మధ్యనులకూ ఆ రోజు

పర్వదినం ! ప్రపంచ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన

శుభతరుణం ! అలనాడు సోక్రాటిస్ మహాత్ముడు కన్నా

బంగారు కలలపంట ' ఇదే !! అలనాడు బుద్ధుడు

సూచించిన మైత్రేయబుద్ధుని 'పునరాగమనం' ఇదే !!

అలనాడు జీసస్ ప్రవచించిన తన 'రెండవ రాక' కుడా

ఇదే !!

నేటి దేశ రాజకీయాలు ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయో అందరికీ తెలుసు.. అందుకు రణం "ఆత్మా- మేధావులు" రాజకీయాల నుంచి దూరంగా ఉండడమే ! ఆత్మజ్ఞానం లేనిదే ఎవ్వరూ "ఆత్మా- మేధావులు" కాలేరు ! అందుకే సోక్రాటిస్ మహాత్ముడు అన్నాడు - "ఆత్మజ్ఞానులే పాలకులుగా ఉండాలి " అని !

పాలకులు స్వార్థపూరితులూ, అవినీతిపరులూ, ఆత్మజ్ఞానరహితులĹ 8; అయినప్పుడు ప్రజాల గతి ఏమని చెప్పాలి ?

"ఆత్మజ్ఞానులు పాలకులు అయిననాడే ప్రపంచం బాగుపడుతుంది " ... అని ప్రభోదించాడు సోక్రాటిస్ ! ... ఆ ఉపదేశమే ఈ " పిరమిడ్ పార్టీ " కి జీవనాడి ! ... అదే, ఈ రాజకీయ ఉద్యమానికి నాంది !!