అన్ని పార్టీల విధనాలనూ కూలంకషంగా స్వంతంగా అధ్యయనం చేసి ' సరైన ప్రతినిధులను ఎన్నుకోవడం' అన్నది ప్రజల భాధ్యత. ఎవరి భాధ్యతలను వారు సక్రమంగా నిర్వర్తిస్తేనే వ్యక్తిగత సౌభాగ్యం, సమాజ శ్రేయస్సు, దేశ ప్రగతి, మరి ప్రపంచ శాంతి !

ఎవరి బాధ్యతలను వారు సరిగ్గా నిర్వర్తించకపోతే ఎవరికీ వారే హాని చేసుకున్నట్టు ! మరి దెశనికీ హాని చేసినట్లే !

" ధర్మో రక్షతి రక్షిత : " ఎవరైతే ధర్మాన్ని కాపాడతారో, ప్రోత్సహిస్తారో, ఎన్నుకుంటారో వారిచేత కాపాడబడిన ప్రోత్సహించబడిన, ఎన్నుకోబడిన ధర్మం తిరిగి వారిని రక్షిస్తుంది !

"అధర్మో భక్షతి రక్షిత : " ఎవరైతే అధర్మాన్ని కాపాడతారో, ప్రోత్సహిస్తారో, ఎన్నుకుంటారో వారిచేత కాపాడబడిన ప్రోత్సహించబడిన, ఎన్నుకోబడిన ధర్మం తిరిగి వారిని రక్షిస్తుంది !

"యతోభ్యుదయ ని: శ్రేయస సిద్ది : స ధర్మ : " దేనివల్లనైతే మరి మోక్షం, అభుదయం అన్నవి సిద్ధిస్తాయో దాన్ని 'ధర్మం' అంటారు. 'అభ్యుదయం' అన్నది రెండు రకాలు 'ఇహ', ఆముత్ర; అంటే 'ధర్మం' అన్నది ఇహలోకం లోనూ కూడా పురోగతిని ఇవ్వగలిగి ఉండాలి.

మన రాష్ట్రంలో, మన దేశంలో, మన యావత్ భూమండలం లోనూ ఇక ధర్మ ప్రతిష్టాపనకు పూనుకుంటుంది "పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా"

"ధర్మ వర్తనులందరూ, శాంతి కముకులందరూ, ఆత్మజ్ఞాన పరయనులందరూ "పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా" ద్వారా ఏకం కావాలి, సంఘటితం కావాలి " అన్నదే "పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా" యొక్క మహావిన్నపం.