నేటి కలలే రేపటి వాస్తవాలకు మూలబిజాలు అవుతాయి.

కలలనేవి కల్లలు కావు...! భవిష్యత్తులో మనకు కావాల్సిన వాటిని కావాల్సిన విధంగా మనం స్వయంగా తిర్చిదిద్దుకునే సుత్తీ కొడవల్లె ... నేడు మనం కనే కలలు !

అయితే, కేవలం చక్కటి కలలు కంటే, కేవలం కలలు కంటూనే ఉంటుంటే ఏమీ లాభం లేదు ! రాష్ట్రం స్వర్నస్ద్రుశం కావాలంటే దానికి ఏది కావాలో అది చెయ్యాలి ! రాష్ట్రం అంటే .. మట్టి కాదు .. ! "రాష్ట్రం" అంటే "ప్రజలు" !

దేశంలోని ప్రజలు అజ్ఞానంతో ఉంటే దేశం కూడా దరిద్రంగనే ఉంటుంది ! ప్రజలు యోగ్యులుగా ఉంటేనే రాష్ట్రం స్వర్ణమయం అవుతుంది ! ప్రజలు అయోగ్యులైతే రాష్ట్రం అయోమయంగానే ఉంటుంది.

" యోగ్యత " అన్నది " యోగ పరిచయం " ద్వారా అంకురించి " యోగ సాధన " ద్వారా క్రమక్రమంగా పుష్పించి ఫలిస్తుంది.

కేవలం భౌతికపరమైన శాస్త్రవిజ్ఞానంతో మాత్రమే అయితే యోగ్యత అన్నది ఎప్పటికి సిద్ధించదు ! కేవలం భౌతికపరమైన విజ్ఞానంతో ఆయితే యోగ్యత అన్నది గగనకుసుమమే !

మరి ఆధ్యాత్మ్కపరమైన విద్యాభ్యాసం ద్వారానే, "సశాస్త్రియమైన ధ్యనానుష్టానం" ద్వారానే ప్రజలు యోగ్యులై విలసిల్లేది !

ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలందరూ యోగ్యులు కకుందాపోతే "స్వర్ణాంధ్ర" అనే కల ఎప్పటికీ కల్లగానే ఉంటుంది ! ఒక్క మాటలో చెప్పాలంటే ... "ధ్యానాంధ్రప్రదేశ్ " కాకుండా "స్వర్ణాంధ్రప్రదేశ్ " సృష్టి అన్నది గాలిలో పెట్టిన దీపం ! పేక మేడ ! గగనకుసుమం ! ఆకాశ హర్మ్యం ! మృగతృష్ణ !

"ధ్యానాంధ్రప్రదేశ్ " కావాలంటే ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలందరూ విధిగా, తప్పనిసరిగా రోజుకు కనీసం గంటైనా ఆనాపానసతి ధ్యానంలో నిమగ్నం కావడం నేర్చుకోవాలి.

"పిరమిడ్ పార్టీ అఫ్ ఇండియా " జిందాబాద్ !