" భీషణ ప్రతిజ్ఞ "

" మన 'వర్తమాన జన్మకాలం ' లోనే ప్రపంచాన్నంతా ధ్యానమయంగా, జ్ఞానమయంగా, శాంతినిలయంగా చేయాలి " అన్నదే " పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా " యొక్క భీషణ ప్రతిజ్ఞ !!! ఈ సత్ సంకల్పంతోనే రానున్న ఎన్నికలలో మరోసారి ఆంధ్రరాష్ట్రంలో అన్ని నియోజికవర్గాలలో " పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా " తన ప్రతినిధులను నిలబెడుతోంది. అంతేకాదు ! కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో కూడా కొన్ని స్థానాలకు గురిపెడుతోంది !!

అలనాడు ... శ్రీరాముడు మొదలుగా గల మహారాజులందరూ ఆధ్యత్మికోన్నతి రాజ్యపాలన సాగించి స్వర్ణయుగాన్ని దిపించారు ! ఆ పాలనలో ప్రజాలందరూ తారతమ్య రహితులై ఆనందంగా జీవించారు. పశుపఖ్యాదులు పచ్చని జీవితాలతో కళకళలాడాయి !

వశిష్ట, విశ్వమిత్రదుల వంటి ఋషి వరెంయులు రాజులకు సత్సహాలను ఇచ్చి, పాలనా పట్టు తప్పకుండా జాగరూకత వహించారు ! తద్వారా కర్తవ్యపాలన, ధర్మసంస్తాపన, జ్ఞాన జగ్రుతిలతో దేశం సుభీక్షమై విలసిల్లితుంది !

ఈనాడు ... వసుదైక కుటుంబం ఏర్పాటులో భాగంగా "పిరమిడ్ ధ్యాన కేంద్రాలు " దేశం నలుమూలలా ఏర్పడ్డాయి; ఏర్పడుతున్నాయి. సరిఅయిన ఆధ్యాత్మికత్వానకి అంకితమైన మహానుభావులు ఆందరిని "ఏక ధ్యానవేదిక" ఫై సంఘటిత పరిచేందుకే పిరమిడ్ ధ్యాన కేంద్రాలు విస్తారంగా ఏర్పడ్డాయి. యావత్ భారతదేశంలో అత్యంత స్వల్పకాలంలో "ధ్యాన రాజ్య స్థాపన" లో భాగంగా 1999 ఎన్నికల్లో పలుపంచికోవాలని నిర్ణయించి పిరమిడ్ ధ్యాన కేంద్రాల మాస్టర్ల ద్వార " పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా " స్థాపించబడింది.

ఆందరం కలసి నడుం కట్టవలసిన తరుణం వచ్చేసింది ! సగటు మానవుడి ఆశయం కూడా ఇప్పుడు "ఆధ్యాత్మిక రాజ్యం" ఏర్పడాలనే !