" అహింస పరోమోధర్మ: " అన్నాడు, గౌతమబుద్ధుడు ! అహింస సిద్ధాంతాన్ని విసృతంగా ప్రచారం చేస్తుంది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ! జీవహింస అన్నది, జంతువువధ అన్నది ఇక పూర్తిగా నిషేదించబడుతుంది.

శాకాహారమే మానవులకు సరియిన ఆహారం. మాంసాహారం అన్నది మానవుల భౌతిక, నైతిక జీవితానికి గొడ్డలిపెట్టు లాంటిది. " పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా " ఈ పరమ సత్యానికి ప్రజలలో విసృత ప్రచారన్నిస్తుంది.

ఆంధ్రరాష్ట్రంలోని ప్రతి గ్రామంలో నూ, ప్రతి పట్టణంలో నూ " పిరమిడ్ ధ్యనారోగ్య కేంద్రాలు " ప్రతిష్టించబడతాయి. రాష్ట్రంలోని ప్రతి మండలంలో నూ ధ్యాన విజ్ఞాన, ఆధ్యాత్మిక విజ్ఞాన గ్రంథాలయాలు నేలకోల్పబడతాయి !